క‌ర్న‌ల్‌‌ సంతోష్‌బాబు పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తాం

సూర్యాపేటలో స్మారక కేంద్రం నిర్మిస్తాం
సూర్యాపేట,జూన్‌18(జ‌నంసాక్షి): క్నల్‌ సంతోష్‌ బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారాన్ని మారుస్తామని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. కర్నల్‌ సంతోష్‌ బాబుకు మంత్రి జగదీష్‌ రెడ్డి అశ్రునయనాతో కడసారి వీడ్కోు పలికారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలికి సంతోష్‌ బాబు పేరు పెడుతామన్నారు. కర్నల్‌ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాుగా ఆదుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే వారి కుటుంబ సభ్యుకు సందేశం పంపారు. వారి ప్లి చదువు, కుటుంబ సభ్యుకు ప్రభుత్వం బాసటగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా, మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ సూచన మేరకు హైదరాబాద్‌ నుంచి కర్నల్‌ భౌతికకాయం తరలింపు మొదుకొని అంత్యక్రియు పూర్తయ్యే వరకు దగ్గరుండి పక్కాగా నిర్వహించారు. దేశం కోసం ప్రాణార్పించిన క్నల్‌ సంతోష్‌ బాబు ప్రజ గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారన్నారు. ఆయన త్యాగం, ధైర్య సాహసాు, తెగువ నేటి యువతకు ఆదర్శప్రాయని చెప్పుకొచ్చారు. ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమన్నారు. సంతోష్‌ బాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా సూర్యాపేట పట్టణంలోని ప్రధాన కూడలికి ఆయన పేరు పెట్టి అభివృద్ధి చేసి గౌరవించుకుంటామని మంత్రి జగదీష్‌ ప్రకటించారు. ఆయన అంత్యక్రియు జరిగిన ప్రాంతాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు. సంతోష్‌ బాబు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని…వారి ప్లిు ఉన్నత చదువు చదువుకోడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. మరోవైపు సంతోష్‌ బాబు అంత్యక్రియకు సూర్యాపేట ప్రజు భారీగా తరలివచ్చారు. సంతోష్‌కు కడసారి కన్నీటి వీడ్కోు పుకుతూ అంతిమయాత్రలో పాల్గొన్నారు.

తాజావార్తలు