క‌ర్న‌ల్‌ సంతోష్‌బాబు అస్తికల నిమజ్జనం

కృష్ణా,మూసి సంగమంలో కలిపిన కుటుంబ సభ్యులు
నల్గొండ,జూన్‌20(జ‌నంసాక్షి): చైనా జవాన్ల మూక దాడిలో వీరత్వం పొందిన క్నల్‌ సంతోష్‌ బాబు అస్తికను కుటుంబ సభ్యు శనివారం నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణ, మూసి నదు సంగమంలో తండ్రి ఉపేందర్‌, భార్య సంతోషి, కుటుంబ సభ్యు నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సంతోష్‌ బాబు అస్తికుంచిన వాహనం దామరచర్ల గ్రామానికి చేరుకోగానే గ్రామస్తు ఆ వాహనం వద్ద శ్రద్దాంజలి ఘటించారు. క్నల్‌ సంతోష్‌బాబు అమర్‌ రహే అంటూ నినాదాు చేశారు.తమ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం భరోసానిచ్చిందని కర్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషి చెప్పారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి వచ్చి సాయం అందిస్తాననడం గొప్ప విషయమని కొనియాడారు. సంతోష్‌ను ఎవరూ తిరిగి తీసుకురాలేరని పేర్కొన్న ఆమె.. తన భర్త నూరిపోసిన ధైర్యం, ప్రభుత్వం ఇస్తున్న స్ఫూర్తితో మిలిటరీ సంబంధిత కార్యక్రమాు చేపట్టాని ఉన్నట్టు తెలిపారు. అమరు కుటుంబాన్నింటికీ సాయంచేయాని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం .. ఆయన విశా హృదయానికి తార్కాణమని ఆమె ప్రశంసించారు. సరిహద్దుల్లో రెచ్చిపోతున్న చైనాకు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం చెప్పాని సంతోషి డిమాండ్‌చేశారు. దేశంలో చైనా వస్తువును బహిష్కరించాని కోరారు. అలాగే తన భర్త ఆశయా మేరకు ప్రజతో కసి పోరాడుతానని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మా అబ్బాయి త్యాగాన్ని గుర్తించారని, నా కుమారుడు వీర మరణం పొందిన వెంటనే ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తున్నందుకు ధన్యవాదాు అని తల్లి మంజు అన్నారు. కడుపుకోత ఉన్నా నా కుమారుడు దేశం కోసం ప్రాణాు అర్పించినందుకు గర్వంగా ఉన్నదన్నారు. సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక తండ్రి ఉపేందర్‌ ధన్యవాదాు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాతో మంత్రి జగదీశ్‌రెడ్డి అంతా తానై మా కుటుంబసభ్యుడిలా అంత్యక్రియు ముగిసే వరకు వెన్నంటి ఉన్నారని అన్నారు. అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు తల్లిదండ్రు ఉపేందర్‌, మంజుతోపాటు భార్య సంతోషిని చినజీయర్‌ స్వామి ఫోన్‌ ద్వారా శుక్రవారం పరామర్శించారు. దేశం గర్వించేలా ప్రాణాు అర్పించడం చాలా గొప్ప విషయమన్నారు.

తాజావార్తలు