ఖమ్మం జిల్లా కృష్ణాపురంలోని రెండిళ్లలో చోరీ
ఖమ్మం: జిల్లాలోని ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో శనివారం వరుసగా రెండిళ్లలో చోరీ జరిగింది. ఇళ్లలోకి చొరబడి రూ. 2 లక్షలు విలువచేసే బంగారం, రూ. 20 వేలు నగదును ఎత్తుకెళ్లారు. ఆ ఇళ్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.