ఖమ్మం: బాలుడిపై పందుల దాడి

మణుగూరుటౌన్‌: ఓ బాలుడిపై పందులు దాడిచేసి గాయపరిచాయి. మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని బాపనకుంట గ్రామంలో సిలివేరు నవీన్‌ అనే బాలుడిపై శనివారం పందులు దాడిచేసి గాయపరిచాయి. అంతేకాకుండా పెంపుడు కుక్కపై దాడిచేయగా అది మృతి చెందింది. పందులు దాడి చేసి కుక్కను చంపడం, బాలుడిని గాయపర్చడం చర్చనీయాంశంగా మారింది. నివాస ప్రాంతాల్లో పందుల స్వైర విహారాన్ని నిరోధించేందుకు మునిసిపల్‌ అధికారులు చర్యలు చేపట్టాలని స్థ్దానికులు కోరుతున్నారు.