ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ పై ప్రత్యేక దృష్టి.

వర్షాల కారణంగా రైస్ మిల్లులలో నిల్వ ఉన్న ధాన్యానికి తగిన భద్రతా ఏర్పాట్లు.
జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలేశ్వర గుప్తా.
తాండూరు అక్టోబర్ 12( జనం సాక్షి)తాండూరు గంజి అసోసియేషన్ భవనంలో వికారాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశము బుధవారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్తా అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ ఖరీఫ్, రబీ సీజన్ లో దాన్యం పరిస్థితి, సిఎంఆర్ సరఫరా ధాన్యము గురించి రైస్ మిల్లర్లకు తగిన సూచనలు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యము దిగుబడి ,సేకరణ, సిఎంఆర్ ధాన్యము కేటాయింపులు సరఫరా తదితర  అంశాల గురించి రైస్ మిల్లర్లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వర్షాల కారణంగా రైస్ మిల్లులలో నిలువ ఉన్న ధాన్యము తడవకుండా ఏ విధమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విధమైన చర్యలు చేపట్టాలో సంఘ సభ్యులతో కలిసి చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మల్లేశం, రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, కటకం వీరేందర్, సత్యనారాయణ, చంద్రకాంత్, రాజు, నర్సింలు తదితరు పాల్గొన్నారు.