ఖాతాల స్తంభనపై కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ జనంసాక్షి : ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాల స్తంభనపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించి కేసును ఈనెల 25కు వాయిదా వేసింది. మరోవైపు స్టేటస్ కో ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా కోర్టు నిరాకరించింది.