ఖానాపురం లో దొంగల బీభత్సం
తాళాలు పగులకొట్టి ఇంట్లో చోరీ,
* బంగారంఅపహరణ,
* సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,క్లూస్ టీం,
ఖానాపురం జనం సాక్షి
మండల కేంద్రములో దొంగలుబీభత్సం సృష్టించారు.తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం అపహరించిన సంఘటన మండల కేంద్రంలో ఆలస్యంవెలుగులోకి వచ్చింది.. గ్రామస్తులుస్థానిక ఎస్ఐ పిట్టలు తిరుపతి వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కొంగర అర్జున్ రావు,కుమారుడు వెంకటేశ్వర్లు రావు ఈ నెల 3వ తేదీన అనారోగ్యంతో హైదరాబాద్ మృతి చెందాడు. కుమారుడుమృతి చెందడంతోకొంగర అర్జున్ రావు,సత్యవతి దంపతులు ఇంటికి తాళం వేసి హైదరాబాదులోని కుమారుడి ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుండితిరిగిసత్యవతి కూతురు అల్లుడు తో కలిసి ఆదివారం సాయంత్రం ఖానాపురం మండల కేంద్రంలోని ఇంటికి చేరుకుంది వారు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపు తెరిచి ఉండడంతోవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి ఎస్సై పిట్టల తిరుపతి, సిబ్బందితో కలిసి పరిశీలించి దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీం, పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.