ఖానాపూర్‌లో వెంకటయ్య అంత్యక్రియలు

మంథని గ్రామీణం: ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా పామడ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు, కేకేబ్ల్యూ సభ్యుడు వెంకటయ్య అలియాస్‌ కిరణ్‌ అంత్యక్రియలు ఖానాపూర్‌లో జరిగాయి. ఈ అంత్యక్రియలకు వైకాపా జిల్లా కన్వీనర్‌ పుట్ట మధు, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు జీఏవీ ప్రసాద్‌, కుమారస్వామి, కోశాధికారి మహ్మద్‌ అక్బర్‌, దళిత లిబరేషన్‌ జిల్లా అధ్యక్షులు సుదర్శన్‌, అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారాం, మాజీ ఎంపీపీ నారమల్ల లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.