ఖానాపూర్ ట్రస్మా నూతన కార్యవర్గం ఎన్నిక
-అధ్యక్షుడిగా పుప్పాల మల్లేష్
ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబరు 22(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యజమాన్యాల(ట్రస్మా) ఖానాపూర్ మండల నూతన కార్యవర్గాన్ని గురువారం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రస్మా మండల అధ్యక్షుడిగా పుప్పాల మల్లేష్ (వివేకానంద పాఠశాల, పెంబి), ప్రధాన కార్యదర్శిగా విద్యాలత, కోశాధికారిగా గాజుల రాజన్న , ఉపాధ్యక్షులుగా తుమ్మనపల్లి సంకేత్వర్ధన్, సహాయ కార్యదర్శిగా బీ. నాగ మొగిలి, గౌరవ అధ్యక్షులుగా ఏనుగు సతీష్ రెడ్డి, సలహా సభ్యులుగా మనోహర స్వామి, ఆశీర్వాదం, సుభాష్ లను ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో గాండ్ల శ్రీనివాస్, మూల శ్రీనివాస్, పడాల సురేందర్, దాడిశెట్టి రాజేశ్వర్, అమరవేణి ప్రవీణ్ గౌడ్, దండు సతీష్, సాబు , దాసరి రాజేశ్వర్, కిషన్ రావు, దామెరి లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.