ఖిలాషాపూర్ సర్వాయి సర్దార్ పాపన్న కోట ను సందర్శించిన ఎక్సైజ్ పర్యాటక క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్
ఖిలాషాపూర్ సర్వాయి సర్దార్ పాపన్న కోట ను సందర్శించిన ఎక్సైజ్ పర్యాటక క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్
-జయంతి ఉత్సవాలు అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది
జనగామ( జనంసాక్షి )రఘునాథపల్లి జూన్22: అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ పోరాడిన బడుగు బలహీన వర్గాల బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల అరవై సంవత్సరాల క్రితమే బహుజనులకు రాజ్యాధికారం రుచి చూపించిన ధీరోదాత్తుడు సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర ఎక్సైజ్. పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ . స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య లు అన్నారు. బుధవారం మండలంలోని ఖిలాషాపురం సర్దార్ సర్వాయి పాపన్న కోట కు రూపాయలు ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు పునరుద్ధరణ పనులను వారు పరిశీలించారు అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య లు కలిసి సర్దార్ సర్వాయి పాపన్న . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు. విగ్రహాలకు పూలమాలవేసి వారు నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం భారీ వర్షాల వల్ల కోట ఒకపక్క కూలి పోవడంతో కోట పక్కనే నివసిస్తున్న ఆరు కుటుంబాల ఇండ్లు నేలమట్టం కావడంతో వారు నిర్వాసితులయ్యారు ఇల్లు కోల్పోయిన బాధితులకు వారం రోజుల్లో ప్రభుత్వమే స్థలం చూపించు ఇల్లు మంజూరు చేస్తామని వారు హామీ ఇచ్చారు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న కోటలోనే నిర్వహించే విధముగా వారు తెలిపారు కోటలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటాలని వారు సంబంధిత అధికారులను ఆదేశించారు మహనీయుల చరిత్ర కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉన్నదని అన్నారు బహుజన జాతి కోసం ప్రాణాలు అర్పించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని వారు కొనియాడారు అలాగే కోట అక్కడ అక్కడ కూలిపోవడంతో వాటి పునరుద్ధరణ పనుల కోసం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయిస్తామని వారు అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఖిలాషాపూర్ కోట తోపాటు తాటికొండ లో ఉన్నటువంటి కోటను కూడా పరిరక్షిస్తామని వారు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యాంశంలో చేర్చి ఆయన పట్ల వారికున్న ప్రాముఖ్యతను చాటారు పాపన్న విగ్రహాన్ని హైదరాబాద్లో ట్యాంక్ బాండ్ ఏర్పాటు చేస్తామని వారు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ యొక్క పూర్వ చరిత్రను కాపాడుకుంటూ పూర్వ వైభవం విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వారు అన్నారు. సర్వాయి పాపన్న జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శివలింగయ్య. జిల్లా జడ్పీ చైర్పర్సన్ పాగాల సంపత్ రెడ్డి. అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు. టూరిజం శాఖ ఎండి బోయినపల్లి మనోహర్ రావు. జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారి కృష్ణప్రియ. ఆర్కియాలజీ డిప్యూటీ డైరెక్టర్ బావల నారాయణ. అసిస్టెంట్ డైరెక్టర్ నరసింగం. ఆర్డీవో మధుమోహన్. తాసిల్దార్ ఎండి అన్వర్. జనగామ జిల్లా సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు పోకల శివ కుమార్ గుప్తా .సర్పంచ్ ముప్పిడి శ్రీధర్. వంగ రాములు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్. మహిళా విభాగం మండల సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ మడ్లపల్లి సునీత రాధాకృష్ణ. మండల యువజన నాయకులు. తదితరులు పాల్గొన్నారు.