ఖైదీ నెంబర్ 1779…

 హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఖైదీ నెంబర్ 1779 కేటాయించారు.  ముడుపుల కేసులో ఆయనను ఏసీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో ఆయనను  ఈరోజు ఉదయం చంచల్గూడ జైలుకు తరలించారు.  కాగా అంతకు ముందు కోర్టు అనుమతితో రేవంత్ రెడ్డి  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు …సిటీ సివిల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.