గంగారం మండలం. మన తెలంగాణ రిపోర్టర్ పల్లే సురేష్ పై ఫారెస్ట్ అధికారి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ

 

గంగారం అక్టోబర్ 11 (జనం సాక్షి) గంగారం మండలం. మన తెలంగాణ రిపోర్టర్ పల్లే సురేష్ పై ఫారెస్ట్ అధికారి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి) గంగారం మండలం చింతగూడెం గ్రామ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ మన తెలంగాణ రిపోర్టర్ పై దాడి చేయడానికి హేయమైన చర్య అని బహుజన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి) గంగారం మండల అధ్యక్షులు తాళ్ల అశోక్ గౌడ్ అన్నారు పాతవిక చర్యల మూలాన.ఏజెన్సీ ప్రాంతంలో జీవించే ఆదివాసీలు అమాయక ప్రజలు ఎంతోమంది వేదనకు గురవుతున్న స్థితిని వాస్తవ పరిస్థితులని వెలికి తీసి ప్రజలను చైతన్యవంతం చేసే ఒక బాధ్యతయుతమైన జర్నలిస్టులపై దాడులు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ దాడిని ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరుతూ ఈ దాడికి పాల్పడిన బీట్ ఆఫీసర్ రమేష్ ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేసే వరకు బి ఎస్ పి పోరాటం చేస్తుంది అని ఆదివాసులకు అండగా బి ఎస్ పి ఎల్లప్పుడూ ఉంటుందాని గంగారం మండల బి ఎస్ పి పార్టీ అధ్యక్షులు తాళ్ల అశోక్ గౌడ్ అన్నారు