గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.

డీసీపీ రవీందర్. గోదావరి ఖని ,
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరి ఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ అవరణంలో, గంజాయి, మత్తు పదార్థాలు నిర్మూలన, ఉత్పత్తి సాగు , అక్రమ రవాణా నియంత్రణ పై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు పార్టీల కార్పొరేటర్ లు, స్వచ్ఛంద సంఘాల నిర్వాహకులు, డ్రైవర్లు ,పాన్ షాప్ నిర్వాహకులు, కిరణ షాప్ నిర్వాహకులతో సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ హాజరై మాట్లాడారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు.గంజాయి ప్రదేశాలను గుర్తించాలి. గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి వారిద్వారా గంజాయి ఎక్కడ నుండి సప్లై చేస్తున్నారు అనే సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది అని దానికి ప్రజాప్రతినిధులు 50, డివిజన్ కార్పొరేటర్ లు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. .గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యువతను ప్రజలను రక్షించవలసిన బాధ్యత మన పైనే ఉందన్నారు.గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు.గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 గాని, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వారికి నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని డీసీపీ తెలిపారు. గంజాయ్ అమ్మిన, తాగిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని డిసిసి తెలిపారు.ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ఏసిపి గిరి ప్రసాద్ , సీఐ లు రమేష్ బాబు,రాజకూమర్ గౌడ, ఎస్ఐ లు ఉమాసాగర్,సతీష్ తోపాటు పోలీస్ సీబ్బంది పాల్గొన్నారు.