గచ్చిబౌలి డివిజన్ అభివృద్దే తన ముందున్న లక్ష్యం – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి”

 ప్రాంతంలోనైనా ఎన్నో కొన్ని సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయని, అయితే ఒక ప్రణాళిక అబద్ధంగా వాటిని అధిగమించడం ద్వారా సమస్య రహిత డివిజన్ గా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గచ్చిబౌలి డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న అనేక సమస్యలను విడతల వారిగా, వివిధ దశలలో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. డివిజన్ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, వేలాడుతున్న తీగలు, విద్యుత్ తీగలను సరిచేయడంవంటి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో కలిసి ముందుకు సాగుతానన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచ వేయడం ద్వారా వర్షాకాలంలో, ఇతర సమయాలలో ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి అవకాశం లభిస్తుందని, అవసరమైన చోట నూతన విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలను ఏర్పాటు చేయించడం ద్వారా రాత్రి వేళల్లో అటు మహిళలకు, ఇటు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేక చొరవ చూపిస్తానన్నారు. ఇందిరానగర్ స్మశాన వాటికలో రోడ్డు మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కకు జరపాలని స్థానికులు వివరించగా విద్యుత్ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను ముగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ గోపాలకృష్ణ, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ బిజెపి వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, ఇందిరా నగర్ కాలనీవాసులు రవి, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు