గజ్వెల్ అభివృద్దికి నిధుల కేటాయింపు
మెదక్ ,ఫిబ్రవరి28(జనంసాక్షి): మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 66 కోట్లు, మంచి నీటి సౌకర్యాల కోసం రూ. 100 కోట్లు మంజూరు చేసినట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభం కాకముందే విపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు.