గడ్కరీ రాజీనామా చేయల్సిందే : యశ్వంత్‌ సిన్హా ఫైర్‌

 

న్యూడిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు గడ్కరీ మరింతగా కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల సంక్షోభం నుంచి ఆయన బయటపడినప్పటికీ తాజాగా మరో గండం వచ్చి పడింది. నితిన్‌ గడ్కరీపై బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా తీవ్రంగా విరుచుకుపడ్డారు.గడ్కరీ రాజీనామా చేయల్సిందే నని ఆయన అన్నారు.పార్టీ అధ్యక్ష పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.గడ్కరీ తప్పు చేశారా,లేదా అనేది చర్చనీయాంశం కాదని, అటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన స్థితిలో ప్రజా జీవితంలో ఉన్నవారు ఉండకూడదని అన్నారు. పూర్తి షుగర్‌,పవర్‌ గ్రూప్‌లకు సంబందంచిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గడ్కరీ రాజీనామా చేయాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు రాంజెత్మలానీ,ఆయన కుమారుడు మహేష్‌ చేసిన డిమాండ్‌ యశ్వంత్‌ సిన్హా తాజా ప్రకటనతో మళ్లీ ముందుకు వచ్చింది. నితిన్‌ గడ్కరీ రాజీనామా చేయాలని ఇటీవల కొద్ది మంది నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ స్థితిలో ఆర్‌ఎస్‌ఎస్‌ రంగప్రవేశం చేసి పరిస్థితిని గడ్కరీకి అనుకూలంగా మలిచిందని అంటున్నారు.దీంతో గడ్కరీ రాజీనామా చేయాలని అబిప్రాయపడిన నేతలు కూడా చల్లబడి వెనరుక్కి తగ్గారని సమాచారం.పదవీ కాలం ముగిసే వరకు పదవిలో కొనసాగడానికి గడ్కరీకి ఏ విధమైన ఆటంకాలు ఉండవని భావించారు.కానీ,యశ్వంత్‌ సిన్హా ప్రకటనతో ఆయన మరోసారి చిక్కుల్లో పడ్డారు.