గడ్డం వెంకట్రామయ్య స్మారకభావన ప్రారంబోత్సవం

బయ్యారం (జనంసాక్షి): భూమి, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు గాదె దివాకర్‌ పిలుపునిచ్చారు. మండలంలోని వెంకట్రామయ్య(దొరన్న) స్మారక భవానిన్ని సోమవారం రాత్రి ఆయన ప్రిరంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విప్లవకారుల మద్య విభేదాలు ఉద్యమానికి తీరనిలోటని దొరన్న చెప్పేవారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోయలెని భారన్ని మోపుతుందని విమర్శించారు. దేశంలొని వివిధ ప్రాంతాలలో ఉన్న సహజ వనరులను పాలకులు కార్పోరేట్‌ సంస్థలకు కేటాయించి ప్రజల సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులను తెరిచి ప్రజలను మద్యానికి బానిసలు చేస్తున్నారన్నారు. అంతకుముందు ఆరుణోదయ కళాకారులు ఆలపించిన పాటలు, బుర్రకథలు సబికులను అకల్లుకున్నాయి. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు డి,వి కృష్ణ, జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు రయల చంద్రశేఖర్‌, జగ్గన్న, చండ్ర అరుణ, నందగగిరి వెంకటేశ్వర్లు, బాటన్న, ప్రభాకర్‌, పీవైఎల్‌ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, దొరన్న సతీమణి వెంకటనర్సమ్మ, కుమారులు వైజేష్‌, రాజేష్‌, పాల్గొన్నారు…