గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్, జనవరి 4 ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగా నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సమైక్ జిల్లా సేవ సమితి డిమాండ్ చేసింది. గణతంత్ర రోజు పతావిష్కరణ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఆ సమితి నాయకులు వసంత్ పవర్, విఠల్ కోరారు. ఈ నెల 21న ఈ డిమాండ్‌తో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వారు ప్రకటించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 62ఏళ్లు పూర్తవుతున్న గణతంత్ర వేడుకల్లో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడం అంబేద్కర్‌ను అవమానపరచడమేనని వారు అన్నారు. అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టే నిరాహార దీక్ష కార్యక్రమాన్నికి జిల్లాలోని అంబేద్కర్ వాదులు, మేధావులు, వివిధ సంఘాలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.