*గణనాథుని నవరాత్రుల ఉత్సవాల లో భాగంగా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 09 (జనం సాక్షి)
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం దుబ్బవాడలోని శ్రీ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో, గణనాథుని నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని , అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిగాయి వేద పండితులు ,పురోహితులు ఆచార్యులు రామబ్రహ్మం ఆధ్వర్యంలో గణేశునికి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఉదయం సాయంత్రం గణనాథుడు పూజలు అందుకొని, శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ గణేశుని ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని వేద పండితులు రామబ్రహ్మం ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు నాంపల్లి సింహాద్రి ,ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు ప్రవీణ్, యూత్ అధ్యక్షులు శ్రీపాద సతీష్ ప్రధాన కార్యదర్శి అక్కినపల్లి హరీష్, కౌన్సిలర్ బుచ్చిరెడ్డి, మర్రి సహదేవ్ , ఓజ్జల శ్రీనివాస్ ,వంగల మహేష్, తిప్పర్తివెంకటేష్ , బెజ్జారపు నవీన్ ,నాంపల్లి సంజీవ్, సురేష్ ,నాంపల్లి రాజేందర్, తాడూరి శ్రీనివాస్, కోటగిరి తిరుమలచారి ,గాలెపల్లి నాగరాజు ,లక్ష్మణ్ ,మురళి ,శ్రీరాం ప్రసాద్ ,కృష్ణ ,శివ, మరియు స్వర్ణకార సంఘ సభ్యులు , యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు