గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని                     

రుద్రంగి సెప్టెంబర్ 1 (జనం సాక్షి);
రుద్రంగి మండల కేంద్రంలో గురువారం రైతు వేదికలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ మండపాల నిర్వాహకులతో తాసిల్దార్ భాస్కర్ ఎస్ఐ ప్రభాకర్ లు సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి గట్ల మీనయ్య,ఎంపీడీవో శంకర్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మంటపాల నిర్వాహకులకు సూచించారు.
మండపాల వద్ద మైక్ వినియోగించుటకు పోలీస్ అధికారుల అనుమతి పొందవలెను,భక్తి పాటలను మాత్రమే వేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి,శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డి.జె.లను వినియోగించరాదు.మండపాల వద్ద ఒకటి లేదా రెండు స్పీకర్ బాక్స్ లను తక్కువ శబ్దంతో వినియోగించుకోవలెను.ఉదయం 6 గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు మాత్రమే మైక్ వినియోగించగలరు.ఊరేగింపు సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఊరేగింపులో మద్యం సేవించి పాల్గొనరాదు. అలాగే డి.జె.లను వినియోగించరాదు.ఊరేగింపులో ముందు వెళ్ళె వాహనాలను ఓవర్ టేక్ చేయరాదు.ఊరేగింపులో కుంకుమ, గులాలు మొదలైన వాటిని దారిన పోయే వారిపై చల్లరాదు. ఒకవేళ మీ వాహనమునకు ఏదైన సమస్య తలెత్తితే వెనక వచ్చే వాహనమునకు దారి ఇవ్వాలి.పై సూచనలు ఎవరు ఉల్లంగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.మంటప నిర్వాకులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు సహకరించాలన్నారు.ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు మంటపాల వద్ద జరిగిన నిర్వహకులదే బాధ్యత అన్నారు.అలాగే మంటపాల నిర్వాహకులు మాట్లాడుతూ…. నిమజ్జనానికి వెళ్లే రోడ్డును బాగు చేయాలని రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తీసివేయాలని,నిమజ్జన ప్రదేశంలో క్రేన్ ఏర్పాటు చేయాలని,అలాగే లైటింగ్ ఏర్పాటు చేయాలన్న�