గనిలో ముంపు గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

తాండూరు: బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణి ఉపరితల గనిలో ముంపునకు గురవుతున్న అబ్బాపూర్‌ గిరిజన గ్రామాన్ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ సందర్శించారు. మరో రెండు నెలల్లో ఉపరితల గని పనులు ప్రారంభం కానుండగా ఇప్పటికీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయాలు, పరిహారంలాంటివి నిర్ణయించలేదు. ఈ మేరకు సోమవారం బాధితులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి అభిప్రాయాలను సేకరించారు. సింగరేణి, రెవెన్యూ అధికారులతో చర్చించి వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట సీపీఐ మండల కార్యదర్శి రాజేశ్‌ ఉన్నారు.