గరీబోళ్ల పథకాలకు గండి కొట్టేవారినీ జైలుకు పంపిస్తా.గరీబోళ్ల పథకాలకు గండి కొట్టేవారినీ జైలుకు పంపిస్తా.స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.

కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల విషయంలో ఎవరైనా లంచం తీసుకున్న, ఇచ్చిన జైలుకు పంపుతానని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు.గురువారం రోజున కోటగిరి మండలంలోని సుద్దులం తాండ గ్రామంలో సేవాలాల్,జగదాంబ మాత మందిరాలు,నూతన గ్రామ పంచాయతీ భవనం,పలు సీసి రోడ్ల నిర్మాణ పనులకు స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ప్రజావేదికగా నిర్వహించిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజక వర్గానికి 11 వేళ్ళ ఇండ్లను మంజూరు కాగా అందులో 25 వందల ఇండ్లను నియోజక వర్గంలోని ఆయా తాండ వాసులకు కేటాయించడం జరిగిందన్నారు.బాన్సువా డ నియోజక వర్గంలో విద్యా ప్రమాణాలను పెంచడా నికి సీఎం కేసీఆర్ ఎస్సి,ఎస్టి,బిసి రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారు.అదే స్పూర్తితో సీఎం కేసీఆర్ నియోజక వర్గానికి మరో రెసిడెన్షియల్ ఎస్టి బాలికల పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయాలని నిధులను కేటాయిస్తూ జీవో విడుదల చేయడం హర్షించ దగ్గ విషయమ న్నారు.ఈ సందర్భంగా స్పీకర్ నియోజక వర్గ ప్రజల పక్షాన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సీఎం కేసీఆర్ ఎస్డిఎఫ్ ఫండ్ క్రింద 2021-22 సం.గాను బాన్సువాడ నియోజక వర్గానికి100 కోట్లను కేటాయించారు.అలాగే సీఎం కెసిఆర్ మరో మారు 2022-23 సం.గాను 100 కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్స్ ను నియోజక వర్గానికి మంజూరు చేయడం అందులో కోటగిరి,పోతంగల్ మండలాల పరిధిలోనీ ఆయా గ్రామాలలోని 238 పనులకు 21 కోట్ల 35 లక్షలు మంజూరు కావడం సీఎం కేసీఆర్ కి బాన్సువాడ నియోజక వర్గ ప్రజలపై ఉన్న ప్రేమ, పాలన దక్షతకు నిదర్శనమని అన్నారు.అదేవిధంగా సమావేశ ప్రారంభానికి ముందు సుద్దులం తాండ సర్పంచ్,మాజీ సర్పంచ్ ఇరువురు తమ గ్రామానికి పలు పనుల విషయంలో నిధులను కేటాయించాలని సభావేదికగా కోరగా స్పీకర్ సానుకూలంగా స్పందిస్తూ సేవాలాల్ మహారాజ్,జగదాంబ మందిరాల నిర్మాణం,ప్రహరీ గోడల నిర్మాణం,డ్రైనేజీలు,బిటి రోడ్ల నిర్మాణాలకి అవసరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాలోత్ కిషన్,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి,ఎంపీపీ వల్లేపల్లీ సునిత శ్రీనివాస్, జెడ్పీటీసీ శంకర్ పటేల్,ఎఎంసి చైర్మన్ హమీద్, మండల అధ్యక్షులు ఎజాజ్ ఖాన్,అర్డిఓ రాజేశ్వర్, జిల్లా,మండల అధికారులు,స్థానిక ఉప సర్పంచ్ మూడ్ మోతీలాల్,స్థానిక ఎఎంసి డైరెక్టర్ మూడ్ చందర్,తాండ మాజీ సర్పంచ్ మాధవ్ రావ్, సుద్దులం సర్పంచ్ సాయిలు,స్థానిక వార్డ్ సభ్యులు, తాండ కారోబార్,నాయక్లు,వర్ని,ఉమ్మడి కోటగిరి మండల ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు