గర్భిణులు,బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి
సిడిపిఓ సుధారాణి భీమ్‌గల్ ప్రతినిధి(జనంసాక్షి):గర్భిణులు , బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు సిడిపిఓ సుధారాణి సూచించారు. శుక్రవారం నాడు భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో భీంగల్ ప్రాజెక్టు లోని అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లకు,గర్భిణులకు,బాలింతలకు పోషణ మాసంలో భాగంగా పోషకాహారం పై అవగాహన,ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి సిడిపిఓ సుధారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ సుధారాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,నెల రోజుల పాటు సామూహిక శ్రీమంతాలు, అన్న ప్రసన, అక్షరాభ్యాసం,కిషోర బాలికలకు రక్తహీనత, పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీడిపిఓ స్వర్ణలత,జ్ఞానేశ్వరి,సూపర్వై జర్ రమాదేవి కౌన్సిలర్లు బోదిరే నర్సయ్య,సతీష్ గౌడ్,కొండూరు హరీష్,అరవింద్, పోషణ అభియాన్ సిబ్బంది సతీష్,ప్రశాంత్,భీంగల్ ఐసిడిఎస్ ప్రాజెక్టు లోని అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు పాల్గొన్నారు.