గవర్నర్ అట్ హోంకు ఇద్దరు చంద్రుల డుమ్మా
హైదరాబాద్ ఆగస్ట్15(జనంసాక్షి):
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ ¬ం’ కార్యక్రమానికి ఇరు రాష్గాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు సీఎంలు రాకపోవడానికి ఎలాంటి ప్రత్యేక కారణాలు అన్వేషించవద్దని మీడియాను కోరారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు తాను ఆమోదయోగ్యమైన గవర్నర్‌నేనని… హైదరాబాద్‌లో ఉన్న చివరిరోజు వరకు ఆయోదయోగ్యంగానే ఉంటానని వ్యాఖ్యానించారు. తాను ఆశావాదినని… పరిస్థితులన్నీ కాలానుగుణంగా చక్కబడతాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ భోంస్లే, ఇతర న్యాయమూర్తులు, అధికార, అనధికార ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ దంపతులు అతిథులను సాదరంగా ఆహ్వానించారు.