గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా.

తాండూరు అక్టోబర్ 2(జనంసాక్షి)గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం అని ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అన్నారు. ఆదివారం యాలాల మండల కేంద్రంలో 153వ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాల వేశారు. ఎంపీపీ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమం లో కీలకంగా వ్యహరించారని, అహింస మార్గం లో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని తెలిపారు.ప్రజలందరూ గాంధీజీ సన్మార్గంలో నడవలన్నారు.కార్యక్రమంలో మండల తెరాస పార్టీ అధ్యక్షులు ఎనికేపల్లి రవీందర్ రెడ్డి, సహకార సంగం వైస్ చైర్మన్ వడ్డే రాములు, ప్రధాన కార్యదర్శి ఆకుల బస్వరాజ్, జిల్లా కో ఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బరుబాబా, నాయకులు మధుసూదన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్, బైమిది అశోక్, అగనూర్ కోట్ల మహేశ్వర్ రెడ్డి, కెవిపిఎస్ జిల్లా నాయకులు మల్కాయ్య, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ రెడ్డి, లాలూ ముదిరాజ్, కృష్ణ, రఘు తదితరులు పాల్గొన్నారు.