గాంధీజీ జయంతి ఘనంగా వేడుకలు సర్పంచ్ రావుల శ్రీనివాసరెడ్డి, చింతల భాస్కర్, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
పెద్దవంగర అక్టోబర్ 02(జనం సాక్షి )అహింస మరియు శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపించి, కోట్లాది మంది భారతీయులకు స్వేచ్చ స్వాతంత్రాలు అందించిన మహనీయుడు, జాతిపిత మహాత్మా గాంధీ అని తెరాస మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య అన్నారు.
గాంధీ జయంతి సందర్బంగా చిట్యాల గుండ్లకుంట్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి, చింతల భాస్కర్,తో కలిసి గాంధీ విగ్రహనికి పూలమాల వేసి, మహాత్మాడికి ఘనంగా నివాళ్ళు అర్పించడం జరిగిందని తెలిపారు. తరువాత మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్న కలలు తెలంగాణ రాష్ట్రలో గ్రామాలను అభివృద్దే లక్ష్యంగా కంకణం కట్టుకొని పనిచేస్తున్న మహానాయకుడు సీఎం కెసిఆర్ అని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాలలో సీసీ రోడ్స్,సైడ్ డ్రైన్స్,గిరిజన తండలకు బి టీ రోడ్స్, స్వచ్ తెలంగాణ వంటి కార్యక్రమల పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు కొల్లూరి రమేష్, ఉపాధ్యక్షులు మొగులగాని హరీష్, ప్రధాన కార్యదర్శి వల్లపు పరమేష్, గ్రామ యూత్ అధ్యక్షులు దేశెట్టి మహేష్, గౌడ సంఘం అధ్యక్షులు రాయిపెల్లి సత్యనారాయణ, మండల పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఆవుల సోమన్న, ఎండీ . వలిబాషా, ఎండీ పాషా, మాజీ వార్డు సభ్యులు కొయ్యేడి రామూర్తి, కొయ్యేడి రామక్కా, సి ఏ లు రాయిపెల్లి మమత, మహిళాలు కొయ్యేడి ఉమ, అనపురం పుష్ప, రాయిపెల్లి లచ్చమ్మ, అనపురం లచ్చమ్మ,కొయ్యేడి శేషమ్మ, స్వరూప, నాయకులు ఆవుల కొమురల్లి,రాపోలు సుదర్శన్, నిమ్మల స్వామి, రాయిపెల్లి శంకరయ్య, కొయ్యేడి నర్సయ్య, మొగులగాని సమ్మయ్య అనపురం రవి,మచ్చ రామయ్య, కొంతం యాదగిరి , గంటకుంట్ల ఎంపీటీసీ ఈ రెంటి అనురాధ , పంచాయతీరాజ్ కార్యదర్శి అశోక్, అంగడి వాడి టీచర్లు స్వరూప, సోమక్క, గ్రామ ప్రజలు గుర్రం శీను, సోమయ్య, మల్లేష్, అంజయ్య,తదితరులు పాల్గొన్నారు