గాంధీజీ, మండేలా మనకు మార్గదర్శకులు
– ప్రధాని మోదీ
దర్బన్,జులై 9(జనంసాక్షి):తన దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ దర్బన్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ అధికారులతో కలిసి ఇవాళ ఆయన పెంట్రించ్ రైల్వే స్టేషన్ నుంచి పీటర్‌మారిట్‌బర్గ్‌కు రైలులో ప్రయాణించారు. పీటర్‌మారిట్‌బర్గ్‌కు చేరుకోగానే అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పీటర్‌మారిట్‌బర్గ్‌లో ఆయన ‘బర్త్ ప్లేస్ ఆఫ్ సత్యాగ్రహ’ పేరిట ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం విూడియాతో మాట్లాడారు. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా జ్ఞాపకాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ స్థలం మోహన్ దాస్ కరంచంద్ (గాంధీ)ని మహాత్మునిగా మార్చిన ప్రదేశమని పేర్కొన్నారు. మహాత్మునికి ఒకనాడు అవమానం జరిగిన స్థలం నుంచి తాను ఇవాళ ప్రసంగిస్తున్నానని పేర్కొన్నారు. 1893లో తెల్లవారు జాతీ వివక్షతతో నీవు నల్లరంగు వాడివి, మాతో బోగీలో ప్రయాణిస్తావా? అంటూ మహాత్మున్ని రైలు బోగీలోంచి నెట్టేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతకు ముందు మోదీ దక్షిణాఫ్రికా దేశ అధికారులతో కలిసి పెంట్రించ్ రైల్వే స్టేషన్ నుంచి పీటర్‌మారిట్‌బర్గ్‌కు రైలులో ప్రయాణం చేశారు. పీటర్‌మారిట్‌బర్గ్‌కు చేరుకోగానే అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పీటర్‌మారిట్‌బర్గ్‌లో ఆయన ‘బర్త్ ప్లేస్ ఆఫ్ సత్యాగ్రహ’ పేరిట ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం విూడియాతో మాట్లాడారు. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా జ్ఞాపకాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ స్థలం మోహన్ దాస్ కరంచంద్ (గాంధీ)ని మహాత్మునిగా మార్చిన ప్రదేశమని వివరించారు. మహాత్మునికి ఒకనాడు అవమానం జరిగిన స్థలం నుంచి తాను ఇవాళ ప్రసంగిస్తున్నానట్లు చెప్పారు. 1893లో తెల్లవారు జాతీ వివక్షతతో నీవు నల్లరంగు వాడివి, మాతో బోగీలో ప్రయాణిస్తావా? అంటూ మహాత్మున్ని రైలు బోగీలోంచి నెట్టేసిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.