గాంధీనగర్ పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్రబృందం
ఖమ్మం,సెప్టెంబర్8(జనంసాక్షి): చింతకాని మండలంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్రబృందం శుక్రవారం పరిశీలించింది. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, 3ఆర్స్ విధానంపై బృంద సభ్యులు పరిశీలన చేశారు. ఈ బృందానికి రాష్ట్ర పరిశీలకులు మల్లిఖార్జునశర్మ నేతృత్వం వహించారు. గణితం, తెలుగు, ఆంగ్లంపై క్షేత్రస్థాయిలో విద్యార్థుల ప్రతిభను పరిశీలిం6చినట్లు ఆయన పేర్కొన్నారు. బృందంలో శ్యాంబాబు, షఫీలు సభ్యులుగా ఉన్నారు. విద్యార్థుల ప్రగతిని పరిశీలించి బృందసభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో అబ్రహాం, హెచ్.ఎం. సుధారాణి పాల్గొన్నారు.