గాంధీభవన్‌కు రాజీవ్ సద్భావన యాత్ర
పల్లె ప్రగతిలో రాజీవ్ కృషి ఎనలేనిది
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్,ఆగస్ట్14(జనంసాక్షి):
గ్రామాల అభివృద్ధి కోసం రాజీవ్‌గాంధీ ఎనలేని కృషి చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పంచాయితీలను ఆయన హయాంలోనే పరిపుష్టం చేశారని అన్నారు. పంచాయితీలకు అధికారాల బదలాయింపునకు ఆనాడే కృషి చేశారన్నారు. ఓటు హక్కును 18ఏళ్లకు తగ్గించిన ఘనత కూడా రాజీవ్‌దేనన్నారు. ఇప్పుడొచ్చిన కేంద్ర సర్కార్ రాజీవ్‌పైనా, గాంధీ కుటుంబం పైనా విమర్శలు చేయడం దారుణమన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని… మోదీ ఏం త్యాగం చేశారని నిలదీశారు. తమిళనాడు శ్రీపెరంబదూర్ నుంచి బయలుదేరిన రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం గాంధీ భవన్‌కు చేరుకుంది. ఆ బృందానికి గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డి.కె.అరుణ, షబ్బీర్ అలీ, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ తన హయాంలో చేపట్టిన అనేక పథకాలు నేడు భారతదేశ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని, అందుకే అంతా ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాల్సిన అవసరం అన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, తెలంగాణ రాష్టాన్న్రి ఇచ్చింది కూడా సోనియాగాంధీయేనన్నారు. గత 24 ఏళ్లుగా ఏటా నిర్వహిస్తున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర ఈ నెల 9న రాజీవ్‌గాంధీ మరణించిన తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో 300 మందితో ప్రారంభమైందని.. 9 రాష్టాల్ర విూదుగా ఈనెల 19న దిల్లీలోని వీరభూమిలో గల రాజీవ్‌గాంధీ సమాధి వద్దకు చేరుకుంటుందన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్టాల్ల్రో ముగించుకుని శుక్రవారం ఇక్కడికి చేరుకుంది. గురువారం రాత్రి జహీరాబాద్ చేరుకున్న యాత్రకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌కుమార్‌షెట్కార్ స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.