గాంధీ సినిమాని తిలకించిన కేటీఎస్ విద్యార్థులు

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గల కెటిఎస్ యాజమాన్యం విద్యార్థులతో కలిసి బుధవారం బాన్సువాడలో ప్రదర్శింపబడుతున్న గాంధీ సినిమా చూపించడానికి ప్రత్యేకంగా స్కూల్ బస్సులలో బయలుదేరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పరశురాం మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో గాంధీజీ పోషించిన పాత్ర గురించి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అంతేకాకుండా స్వాతంత్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావుల పుణ్యమే అని స్వాతంత్రం యొక్క విలువ విద్యార్థులకు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టిన్నటు చూసి ఇంత కష్టపడ్డారా స్వాతంత్రం గురించి అని తెలపడానికి  గాంధీ సినిమాకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. గాంధారి నుండి బాన్సువాడకు రాకపోకలకు విద్యార్థుల కు  15000 రూపాయల వరకు ఖర్చు అయినా విద్యార్థులకు అవగాహన కల్పించాలనే దృఢసంకల్పంతో తీసుకురావడం జరిగిందని ఇలానైనా సరే విద్యార్థులకు స్వాతంత్రం యొక్క గొప్పతనం తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

తాజావార్తలు