‘గాజా’లో కాల్పుల విరమణకు ఓప్పందం…
కైరో : గాజా భూభాగంలో వారం రోజులుగా 150 మందిని బలి తీసుకున్న దాడులు,ఎదురుదాడులకు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. ఇజ్రాయెల్, హమస్‌ల మ ధ్య వర్తిత్వం చేస్తున్న ఈజిప్ ప్రయాత్నాలు ఫలించి కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. గాజా భూభాగంపైకి, భూ, వాయు ,జల మార్గాల ద్వారా చేసే దాడులను నిలిపివేయాలి. అటు పాలస్తీనా వర్గాలు గాజా వైపు నుంచి ఇజ్రాయెల్ మీద రాకేట్ దాడులను, సరిహద్దు దాడులను తక్షణం ఆపేయాల్సి ఉంటుంది. ఓప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఈ ఓప్పందానికి సహకరించిన అందరికి ఈజిప్ట్ విదేశాంగశాఖమంత్రి మహమ్మద్ కమల్ కృతజ్ఞతలు ప్రకటించారు. అమెరికా విదేశాంగశాఖమంత్రి హిల్లరి క్లింటన్‌తో కలిసి కమల్ కైరో లో మీడియాతో సమావేశాలంలో కాల్పుల విరమణ ఓప్పందం వివారాలను వెల్లడించారు. ఈ ఓప్పందాన్ని అమెరికా స్వాగతిస్తుందని హిల్లరీ చేప్పారు. సశ్చిమ ఆసియాలో శాంతి నెలకోనడానికి అమెరికా కృషి చేస్తుందానికి అన్నారు. వారం రోజులక్రితం హమస్ నాయకుడు అహ్మద్ జబారిని ఇజ్రాయెల్ కాల్చిచంపడంతో గాజాలో హింసాకాండా తిరిగి ప్రారంభమైంది.