గాజులపల్లి ముదిరాజ్ భవనానికి నిధులు మంజూరు.

దౌల్తాబాద్ అక్టోబర్ 11, జనం సాక్షి.
 దౌల్తాబాద్ మండల పరిధిలో గాజులపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కు గొడుగుపల్లిలో ఆమె నివాసంలో ముదిరాజ్ సంఘం సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. ముదిరాజ్ సంఘం సభ్యులు అడిగిన వెంటనే ఐదు లక్షలు మంజూరు చేస్తానని జడ్పీటీసీ తెలిపారు. అడగగానే వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన జడ్పిటిసి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులపల్లి ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area