గాలివాన బీభత్సం-భారీగా ఆస్తి నష్టం
టేకులపల్లి (జనంసాక్షి): మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న, భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి., దీంతో ట్రాఫిక్ సైతం స్తంభించింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న వృక్షాలను సీఐ ఆధ్వర్యంలో తొలగించడంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి. అయితే మండలంలో గాలులు, వాన సృష్టించిన బీభత్సం కారణంగా మామిడి, వరిపంటలు, ఇల్లు, విద్యుత్ తదితర వాటికి సుమారు రూ.50లక్షల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా….