గాలి హెలికాప్టర్ కేసు జనవరి 3కి వాయిదా
హైదరాబాద్: తన హెలికాప్టర్‌ను తిరిగి అప్పగించాలన్న గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై జనవరి 3న న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది. పిటిషన్‌పై ఇవాళ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది. పిటిషన్‌పై ఇవాళ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. హెలికాప్టర్‌ను ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అప్పగించవద్దని సీబీఐ కోరింది. ఓకవేళ హెలికాప్టర్ చెడిపోతుందిని భావిస్తే,, దాన్ని అమ్మి ఆ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో కోర్టు అధీనంలో ఉంచాలని దర్యాప్తు సంస్థ కోరింది. అయితే కేసుపై విచారణ పూర్తయ్యాకే ఆస్తుల అమ్మకాలపై నిర్ణయం ఉంటుందని,,. ఈదశలో కాదని కోర్టు పేర్కొంది. హెలికాప్టర్ విలువ రూ. 3 కోట్లు అని భీమా కంపెనీ నిరారించినందున అందుకు సమానమైన స్థిరాస్తిని పూచీకత్తుగా సమర్పిస్తామని గాలి జనార్డన్‌రెడ్డి తరపు న్యాయవాది సురేందర్‌రావు కోర్టుకు చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జనవరి 3వ తేదికి వాయిదా వేసింది.