గినియా పల్లి లో బతుకమ్మ చీరల పంపిణీ
ఝరాసంగం సెప్టెంబర్ 27 (జనం సాక్షి) మండల పరిధిలోని గినియర్ పల్లి లో మంగళవారం బతుకమ్మ చీరల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంగమ్మ నర్సింహారెడ్డి మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, మొద్దు కాలు ఉన్నవారికి, ఫైలేరియా వ్యాధి ఉన్నవారికి, ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారికి, రూ.2,016 మరియు వికలాంగులకు రూ.3,016 ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే భారతదేశంలోనే అది ఓకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు యం నర్సిములు, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, ఉప సర్పంచ్ సమద్ పటేల్, నాయకులు ల్యాకాత్ అలీ, వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.