గిరిజనులకు 10 శాతం జిఓ ని వెంటనే విడుదల చేయాలి.

 

 

 

 

 

 

 

లంబాడీస్ జాయింట్ యాక్షన్ కమిటీ.లంబాడీస్ జాయింట్ యాక్షన్ కమిటీ.
జనం సాక్షి ఉట్నూర్.
మండల కేంద్రంలో గురువారం లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బనోవత్ రామారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గిరిజను లంబాడీలను 10% రిజర్వేషన్ ఇస్తానని గత 17వ తేదీన  హైదరాబాద్ లో జరిగిన ఆదివాసి భవన్ బంజారా భవన్ ప్రారంభోత్సవా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తానని వారం రోజులలో జియోని విడుదల చేస్తానని అన్నారు. వారం రోజుల గడిచినప్పటికీ జీవో విడుదల చేయలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాటని  గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ జిఓ నీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాథోడ్ గణేష్ రాథోడ్ అన్వేష్ కపిల్ కుమార్ ఉమాజీ సోమేశ్ మహేష్ రవి నారాయణ మోహన్ శేషారావు ప్రేమ్ సింగ్ వంశీ ప్రభు తదితరులు ఉన్నారు.