గిరిజనుల భూములకు సాగునీటి వసతి కల్పించేందుకు సీఎం గిరి వికాసం
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల భూములకు సాగు నీటి వసతి కల్పించేందుకు సీఎం గిరి వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
గురువారం కలెక్టరేట్ కాన్ఫెరెన్స్ హాల్ లో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాదుతూ గిరి వికాసం పథకం ద్వారా జిల్లాలో 53 లబ్ధిదారులను గతంలో ఎంపిక చేయడం జరిగిందని , వారికి మంజూరైన 188. 26 లక్షల నుండి 56.99 లక్షలు ఖర్చు చేసి 26 పంపు సెట్లను గిరిజనులకు సేద్యం కొరకు అందజేసిన్నట్లు , కొత్తగా నారాయణపురం మండలంలో 83 మందిని ఎంపిక చేసిన్నట్లు వారి కొరకు సర్వే పరిపాలన పరమైన మంజూరీ జులై -4 వరకు పూర్తి చేయాలనీ , జులై -31 వరకు మంజూరైన నిధులలో మిగిలి ఉన్న 131. 57 లక్షలతో గ్రౌండింగ్ పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.ఈ పథకం కింద గిరిజనుల పట్టా లేదా అసైన్డ్ భూములను గుర్తించి ఇద్దరు లేదా అంతేకంటే ఎక్కువమంది లబ్ధిదారులు ఉండే విధంగా, పక్క పక్కన భూములు ఉన్నవారిని గుర్తించి వారి భూములలో సాగు నీటి సౌకర్యం కల్పిస్తారని దీనికొరకు గుర్తించిన భూములలో జియోలాజిస్ట్ తో గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహించి నీటి లభ్యత ఆధారంగా బోరు బావి తవ్వించి విద్యుత్ ధికరణ , మోటార్ పంపు సెట్లు బిగించి పూర్తి సాగులోకి తీసుకరావడం జరుగుంతుందని ఇది పూర్తి సబ్సిడీ తో చేపట్టే కార్యక్రమం అని , అర్హులైన గిరిజనులు అందరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా తవ్వించిన బోరు బావులకు విద్యుత్ ధికరణ పనులు పూర్తి చేయాలనీ విద్యుత్ శాఖ వారిని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పీడీ డి ఆర్ డి ఓ యo .ఉపేందర్ రెడ్డి, ఏ పి ఓ శ్యామల, విద్యుత్ శాఖ చౌటుప్పల్ డివిజన్ ఏ డి ఆర్.శ్యామ్ కుమార్, నారాయణపురం ఏ. ఈ జయన్న, పి ఓ ఈనాయత్ అలీ, సి.ఈ హిదాయతుల్ల సంబంధిత అధికారులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.