*గిరిజన బిడ్డలు ఉన్నత స్థానాలకు ఎదగాలి
కోదాడ అక్టోబర్ 23(జనం సాక్షి )
గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎంఎస్ కళాశాల ఆడిటోరియంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన సామాజిక సేవకులు మాలోత్ సైదా నాయక్ , గిరిజన ఉద్యోగ ఉత్తమ అవార్డు గ్రహీతలకు ఏర్పాటుచేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత పాలకుల గిరిజనులను ఓటు బ్యాంకు గానే వినియోగించుకున్నారేతప్పా గిరిజనుల సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గిరిజనుల బతుకులను మార్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గిరిజనులు పూట గడవక అంగట్లో ఆడపిల్లల్ని అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు. గిరిజనులు ఆడపిల్ల పెళ్లి చేయక పడుతున్న కష్టాలు చూసి సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం గిరిజన తండాలు నుండి ప్రారంభించారన్నారు. గిరిజనులు ఉన్నత లక్ష్యాలు సాధించడానికి గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్ర రాజధానిలో బంజారా భవన్, గిరిజన పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య కోసం గిరిజన గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేసిందన్నారు. నేడు గిరిజనులు విద్యా పరంగా సామాజికంగా రాజకీయంగా అన్నారు దేశవిదేశాల్లో గిరిజన బిడ్డలు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన గిరిజన బిడ్డ మాలోత్ పూర్ణ గిరిజన జాతికే గర్వకారణం అన్నారు. గిరిజనుల డిమాండ్ల నీటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు. కోదాడలో గిరిజన భవనం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అనంతరం సైదా నాయక్ తో పాటు ఉత్తమ ఉద్యోగులు అందరినీ ఘనంగా సన్మానించారు. గిరిజన ఉద్యోగుల సంఘం కోదాడ డివిజన్ అధ్యక్షులు టి భావ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవిత రాధా రెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ భట్టురమేష్, డాక్టర్ దశరథ్ నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టీ బావ సింగ్,ఎంవిఐ భూక్య వీరేందర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు భూక్య హనుమానాయక్, సంఘం గౌరవ అధ్యక్షులు బాలాజీ నాయక్, మాజీ అధ్యక్షులు హాజీ నాయక్,టిజిఎస్ జిల్లా అధ్యక్షులు రామా నాయక్, రాష్ట్రంలో సేవాలాల్ ఇంచార్జి ఏం సైదా నాయక్, టి జి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్ నాయక్,కోదాడ డివిజన్ ఉపాధ్యక్షులు డి సైదులు నాయక్ సేవాలాల్ సేన రాష్ట్ర కార్మిక సంఘం విభాగం నాయకులు పంతులు నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రాజు నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు రవి నాయక్,ఎఈఈ బర్మావత్ నాగునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|