గిరిజన బిడ్డ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం.

తొర్రూర్ 22 జూన్( జనంసాక్షి )రోజు తొర్రూర్ లో బిజెపి గిరిజన మోర్చ ఆధ్వర్యంలోఎన్డీఏ  రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన ఆదివాసీ మహిళను ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా శిక్షణ తరగతుల ఇంఛార్జి పాకనాటి దామోదర్ రెడ్డి  మాట్లాడుతూ భారత నూతన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే అభ్యర్థిగా ఆదివాసీ, గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము ని ఎంపిక చేసి మోడీ  గిరిజనుల పక్షపాతిగా మారిపోయారని తెలిపారు.గిరిజనుల అభ్యున్నతికి, అభివృద్ధి కి ,మహిళల కోసం మహిళాభివ్రృద్ది కోసం మోడీ గారు చేస్తున్న క్రమంలో భాగంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారిని ఎంపిక చేసి తమ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది అని తెలిపారు.గతంలో అబ్దుల్ కలాం ని, మొన్నటి వరకు రామ్ నాథ్ కోవింద్ ని నేడు గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము ని ఇలా బీజేపీ రాష్ట్ర పతులు గా అవకాశం కల్పించి సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాల ప్రజల కోసం పాటుపడుతూ సభ్ కా సాత్ సభ్ కా వికాస్ నినాదం ఎత్తుకొని బీజేపీ పనిచేస్తుంది అని తెలిపారు.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు గిరిజన బిడ్డ ను రాష్ట్రపతి అభ్యర్థిగా కేవలం బీజేపీ మాత్రమే అవకాశం కల్పించింది అని తెలిపారు. ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గారు అధిక మెజారిటీ తో గెలిచి రాష్ట్ర పతి ఎన్నికై సంచలనం సృష్టించి భారత నూతన రాష్ట్రపతి గా ఎన్నికవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా కార్యదర్శులు పరుపాటి రాం మోహన్ రెడ్డి, రచ్చ కుమార్,15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్, ఎస్టీ మోర్చ జిల్లా కార్యదర్శి రాయపురంరాజకుమార్,ఎస్టీ మోర్చ అర్బన్ అధ్యక్షుడు ధరావత్ రాజశేఖర్, బీజేపీ,బీజేవైఎం నాయకులు అన్నం మధుసూదన్ రెడ్డి,గుడిమళ్ళ వెంకటేశ్వర్లుకాగు నవీన్, గట్ల భరత్,నూకల నవీన్,నడిగడ్డ సందీప్,నర్కుటి ఛలపతి రాజ్,బొమ్మనబోయిన సుధాకర్,వడ్లకొండ రవి,సి.హెచ్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.