*గిరిజన_సంక్షేమ_శాఖ_మంత్రి_సత్యవతి_రాథోడ్_గారిని కలిసిన సర్పంచ్ లు*
తరిగొప్పుల మండలంలోని మాన్సింగ్ తండా సర్పంచ్ లాకావత్ నంద్యానయక్,వాచ్యతండా సర్పంచ్ బానోత్ నాయక్,కొత్త తండా సర్పంచ్ బానోత్ భూలి యాదయ్య నాయక్,అంకుషాపూర్ గ్రామ సర్పంచ్ బుచ్చిరాజు యాదవ్,మాజీ ఎంపీపీ నుకల కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు మదాసు భిక్షపతి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి_సత్యవతి_రాథోడ్_గారిని మర్యాద పూర్వకంగా కలిసి నూతనంగా ఏర్పాటు అయిన తండాలకు బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుంది అని అన్నారు. తొందరలోనే అధికారుల ద్వారా ప్రతిపాదనలు తెప్పించుకుని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్ ,సర్పంచ్ లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area