గుండెగా0 టూ బైంసా తాసిల్దార్ కార్యాలయానికి గ్రామప్రజల వాక్..! – రెండు రోజులక్రితం కరెంటు లేక కూరలో పడ్డ బాలుడు…
భైంసా రూరల్ ఫిబ్రవరి 28 జనం సాక్షి తాసిల్దార్ కి తమ సమస్యల విన్నపం…పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు వల్ల గత ఏడు సంవత్సరాలుగా బైంసా మండలంలోని గుండెగాం ప్రజలు ప్రతి వర్షాకాలం వరదలముంపు కి గురవుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ సమస్య తీరడంమే లేదు.అయితే నూతనంగా భైంసా-గుండెగా0 రహదారిలో నిర్మించినటువంటి డబల్ బెడ్రూంలో తాత్కాలిక నివాసం ఉంటున్న కొందరు ప్రజలు అక్కడ కూడా ఎదో ఒక రూపంలో కష్టాలు తప్పడం లేదంటూ తెలుపుతూన్నారు. అయ్యో ఎన్ని రోజులు మాకీ సమస్యలంటూ శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయండ0టూ తమ ఆవేదనను వెల్లడించుకుంటున్నారు. మంగళవారం గుండెగా0 గ్రామం నుండి బైంసా మండల తాసిల్దార్ కార్యాలయం వరకు తమ సమస్యలు అందరికీ తెలిసే విధంగా నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. మార్గమధ్యంలో వీళ్లను చూసిన జనాలు అయ్యోపాపం గుండెగా0 ప్రజలఆవేదన ఇంకా తీరడం లేదంటూ గొసపడ్డరు. తాత్కాలిక నివాసం ఉంటున్న డబల్ బెడ్రూమ్ ఇండ్లలో సైతం కరెంటు,వాటర్ లేకపోవడంతో గత 3 రోజులుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ గ్రామ ప్రజలు తహసిల్దార్ కార్యాలయంలో బైఠాయించి,ఎమ్మార్వో కి విన్నవించారు. రెండు రోజుల క్రితం కరెంటు లేక వండిన కూరలో బాలుడు పడ్డాడని, అడవి పందులు కూడా సంచరిస్తున్నాయని, కరెంటు లేక పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కరెంటు సమస్య పరిష్కరించే దిశగా ఆర్డిఓ,కరెంట్ ఏ.ఈ,గ్రామ సర్పంచ్ లతో కలిసి మాట్లాడతానని తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామ ప్రజలకు తెలిపారు.