గుజరాత్ ముఖ్యమంత్రి మార్పు?

anandiben-patelవచ్చే ఏడాది జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ను మార్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో నితిన్ భాయ్ పటేల్ కు సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశం కన్పిస్తోంది. పటేళ్ల ఆందోళనను నియంత్రించడంలో వైఫల్యంతో పాటు.. ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా మార్పుకు కారణమని భావిస్తున్నారు. వీటితో పాటు ఆమెను తప్పనిసరిగా మార్చాలని మెజార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే గుజరాత్ కు చెందిన ఓ నేత ఆనందీ బెన్ పాలనపై ప్రధాని మోడీకి నివేదిక సమర్పించారు. ఆనందీ బెన్ ను పంజాబ్ గవర్నర్ గా నియమించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే ముందు ఆనందీ బెన్ పటేల్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.