‘గుజ్జుల’కు కీలక పదవి?
ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న గుజ్జుల రామకృష్ణారెడ్డికి త్వరలో నియమించే రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబె వెంకటయ్య నాయుడు కిషన్‌డ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలసింది. మురళీధర్‌రావు తాజా ప్రవేశం, విద్యాసాగర్‌రావు మరో వర్గంవాడు కావడంతో తనకంటూ జిల్లాలో బలమైన వర్గం ఉండాలనే ఉత్సాహంతో ఉన్న వెంకయ్య రామకృష్ణారెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలసింది. విద్యాసాగర్‌రావు, రామాకృష్ణారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుని విషయంలో ఏకాభివూపాయానికి వచ్చి రెండోసారి మీస అర్జున్‌రావు పేరును ప్రతిపాదించిండంతో ఆయన ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కార్యవర్గంతో పాటు పలు మండలాల కార్యవర్గాలను ప్రకటించాల్సిన ఉంది. సంస్థాగతం పూర్తి చేయాలంటే ఇప్పుడున్న రెండు వర్గాలకు తోడు మురళీధర్‌రావు వర్గాన్ని కూడ సంతృప్తిపరచాల్సిన అవసరం జిల్లా అధ్యక్షుడికి ఉంటుంది. అయితే తమ వాడుగా అర్జున్‌రావును ప్రతిపాదించిన విద్యాసాగర్‌రావు, రామకృష్ణారెడ్డి కార్యవర్గంలో తమవారికే పెద్దపీట వేయాలని పట్టుబడే అవకాశం ఉండటంతో అర్జున్‌రావుకు కార్యవర్గ నియామకం అగ్నిపరీక్షగా మారబోతుంది. మొత్తానికి మురళీధర్‌రావు రాకతో బీజేపీలో పెనుమార్పులు మాత్రం ఖాయమని కార్యకర్తలంటున్నారు.
బండి పయనమెటువైపో..?
బీజేపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ కార్పోరేటర్ బండి సంజయ్ పదవీకాలం ముగియనుంది. ఆయన రెండోసారి ఇదే పదవి రావడం కష్టమే బండి కూడ నగర అధ్యక్షుడిగా రెండోసారి ప్రయత్నించకుండా కరీంనగర్ నియోజకవర్గంపై దృష్టిసారించి పలు కార్యక్షికమాలు చేపడుతున్నాడు. ఇటీవల అధ్యాత్మిక కార్యక్షికమాలను పార్టీలకతీతంగా అన్నీ తానై నిర్వహించాడు. పరిపూర్ణానందస్వామిని సైతం ఆహ్వానించి సభను విజయవంతం చేయడంతో నగరంతోపాటు నియోజకవర్గంలో తనకంటూ ఒక పట్టును సంపాదించగలిగాడు. సంజయ్ తీరుపై రామాకృష్ణారెడ్డి వర్గం గుర్రుగా ఉంది, సంజయ్ కొద్దికాలం విద్యాసాగర్‌రావుకు సన్నిహితంగా ఉండి, ఇటీవల కాలం నుంచి పార్టీ కార్యక్షిక్షమాలకు దూరంగా ఉంటున్నాడు. వెంకయ్యనాయుడు శిష్యుడిగా ముద్రపడ్డ సంజయ్ ఇటీవల ఆయన సభకు హాజరైనాడు. సంఘ్‌పరివార్ మనిషిగా పేరున్న సంజయ్ ప్రస్తుతం, బీజేపీలో మారుతున్న సమీకరణకు అనుగుణంగా మారుతాడా లేక ఒంటరిగా ముందుకు నడుస్తాడా, మురళీధర్‌రావు వైపు మొగ్గుచూపుతాడా అన్నది తేలనుంది.