గుజ్రాల్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

పలువురు ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ,డిసెంబర్‌1 (జనంసాక్షి) :

మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు ఆప్తులు, బంధు వులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్‌ వద్ద ప్రభుత్వలాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభమై స్మృతిస్థలి వరకు సాగింది. గుజ్రాల్‌కు తుదివీడ్కోలు పలికిన వారిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ… తదితరులు న్నారు. విదేశాంగనీతిలో దివంగత మాజీ ప్రధాని గుజ్రాల్‌ సిద్దహస్తుడని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు.

మాజీ ప్రధాని గుజ్రాల్‌కు నివాళుల ర్పించిన అనంతం ఆయన మాట్లాడుతూ దక్షిణా సియాలో ఇరుగు పొరుగుౖ ‘ళిశాలతో సంబంధాలు మెరుగు పరిచేందుకు గుజ్రాల్‌ కృషిచేశారన్నారు. అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని గుజ్రాల్‌ భౌతికకా యానికి టిడిపి ఎంపీలు నామా నాగేశ్వరరావు, హరికృష్ణ నివాళులు అర్పిం చారు.