గుజ్రాల్ పరిస్థితి విషమం
గుర్‌గావ్ : మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గుర్‌గావ్‌లోని మెడిసిటీ మెడంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 92 ఏళ్ల గుజ్రాల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. సంవత్సరకాలం నుంచి డయాలసిస్ చికిత్స పొందుతున్న గుజ్రాల్ నాలుగు రోజుల క్రితం ఛాతి నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. గుజ్రాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని ఆయన కుమారుడు ఎంపి నరేష్ గుజ్రాల్ తెలిపారు.