గుజ్రాల్ మృతికి ఏడు రోజులు సంతాపం
మెదక్, డిసెంబర్ 1 : భారతదేశ మాజీ ప్రధాని గుజ్రాల్ మృతి చెందినందున రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించిందని జిల్లా కలెక్టర్ శనివారం తెలిపారు. నవంబర్ 30 నుండి డిసెంబర్ ఆరు వరకు ఏడు రోజుల పాటు సంతాప దినాల సూచికంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాథ్యూ వివరించారు.