గుట్ట పచ్చ నోట్ల కట్టైంది….

గుట్టలన్ని గుటుక్కు మంటాంటే గంత పట్టింపు లేని తనం తెలంగాణ లోనే కన్పిస్తుంది. ఆకంకడ ఆవేశము ఎక్కువ ఎత్తుగడ తక్కువ అటెన్న ఓడిగపోవడం మామూలే.. ఇది తెలంగాణ సాయుధ పోరాటం కాలం నుంచీ నడుసున్నది. ప్రకృతి సౌందర్యం అయిన గుట్టు జాడల రానున్న రోజుల్లో కన్పించక పోవచ్చు ఎందుకంటే కరీంనగర్‌ జిల్లా లోని 570 గుట్టలను కైమ కైమ చేసుకుని అమ్ముకునేందుకు సర్కార్‌ లైసన్స్‌లు మంజూరి చేసింది. దీనికి సీమాంధ్ర వ్యాపారులు సై అని ఇక్కడి గుట్టలను విధేశాలకు అమ్ముకుంటుడ్రు కరీంనగర్‌ నుంచి వేములావాడ పోయే మార్గంలోని ఒద్దారం గుట్టను గత ఆరేడు ఏండ్లుగా నమిలి మిగిండ్రు ఇప్పడక్కడ ఒక భయానక భూకంప వాతవరణం కన్పిస్తుంది. భూఉపరితలంలో కన్పించే రాయినే గాకుండా భూమి లోపల ఉన్న గుట్టనంతా ఊర్చుక పోతుండ్రు అసలు గుట్ట సహజ మైన సౌందర్యత్మమే కాదు ఇది పర్యావరణంకుఎంతో ఉపయుగ్మం అవుతుంది. గట్టుమీది మాత్రమే పెరిగే జీవరాశులుంటాయి. గట్టు మీద మాత్రమే చెట్లు ఉంటాయి. గుట్ట మీద కురిసిన వర్షం ధారలు కిందికి జారి వాగులు గామారి వ్యవసాయంకు ఉపయోగ పడుతాయి చెరువులు కుంటలు నిండుతాయి

అసలు గుట్టపుటింది లక్షల ఏండ్ల క్రిందటి ఇంకా లక్షల ఏండ్ల దాకా ఉండాల్సిన గుట్టలు గుట్టలు నడుమ వచ్చిన రాజకీయ నాయకులకు రాజ్యలకు పంపని ఆగుట్టను అంతం చేయడం గుట్టను తీసి అమ్ముకుంటే మళ్లీ గుట్ట మొత్తంగా! మొలవదు పెరగదు.

ఇంకా చెట్ల నీళ్లు ఉనికే అమ్ముకున్నా వాటిని మళ్లీ సంపాదిం చుకోవచ్చు కాని గుట్ట నెట్లా పుటిస్తావ్‌? అసలు నీళ్లు చెట్లు ఉసికె అమ్ముకున్నా పర్యావరణ సమఙబతుల్యత దెబ్బతింటది అదీ ప్రకృతి విరుద్దమైన పనే కాని మళ్లీ సంపాదించుకోవచ్చు గుట్ట నెట్లా అవుద్దో సామ్రాజ్య వాదులకే ఎరుక

వ్యాపారం లో లాంచం ప్రధానం అయిన వాల్లకు అమ్మకూడదని అనీ ఎదీలేదు అందిన కాడిక అమ్ముకనుడు కోట్లు కుప్ప పోసుకునుడు, ఈ గుట్టలన్ని కొనుక్కున్న గ్రైనైట్‌ రాళ్లుగా మార్పు కొని కొనుక్కునేవాల్ల చైనా ఇతర విదేశాలు మరి వాల్లకు గుట్టలకు లేవా అంటే ఉన్నాయి గాని వాల్ల వాటిని నాశనం చేయరట ఆయా ప్రభుత్వాలు వాల్లకు అనుమతి ఇవ్దదు మరి మన పాలకులు గుట్టలన్ని అమ్ముకుంటది దాని మీద ఆదారపక్ష క వాల్లను ఆగ్రామ ప్రజలను విస్మరించి గుట్టను దళారీల లీజుకిచ్చి పరోకొన్ని పైసలు ప్రభుత్వం తీసుకుని గుట్టల కొద్ది ధనాన్ని వ్యాపారికిస్తుంది.

ఇందంతా వేలా లక్షల కోట్ల వ్యాపారంగా నడుస్తుంది. స్థానిక రాజకీయ నాయకులను కూడ చిన్న చిన్న కాంట్రాక్టులుగా కుదుర్చుకుని తిరగబడి మర్లబడిన నాయకులను మచ్చిక చేసుకుని గుట్టను తవ్వకపోవుడు సుర్వు అయ్యింది. వ ఏగుట్ట మీద నన్న దేవుని గుడిటవ బొమ్మచారిత్మ్రక ఆనవాళ్ల ఉంటే దానికి లీజుకు ఇవ్వరాదు కాని ఘరానా వ్యాపారులు ఏదైనా ఏమైనా మనం చాలా చోట్ల చాలా అంశాలు చూస్తున్నాం అనవాల్లు అందరీని లొంగదీసుకుంటారు తల్లిలాంటి గుట్ట తల్లినే అమ్ముకుంటున్నారు.

కరీంనగర్‌ జిల్లాలోని పొట్లపల్లి డగ్గర ఎల్లమ్మ గుట్టను కూడా తరలించక పోయేదరు సిద్దమైండ్రు ఎల్లమ్మ కింద చారిత్మ్రక ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడ లోహ నాగరికత ఉన్నట్లుగా ఆది మానవుని సమాధుల ఉన్నట్లుగా ఆధారాలున్నాయి శాసనాలున్నాయి. వీటన్నింటిని పట్టకుండా ఆగుట్టలు లీజుకెలా ఇచ్చారని ఆమాయకపు ప్రశ్నలెమోగాని ఆగుట్టల లీజు రద్దుకు పొట్లపల్లి ప్రజలు పొరబాటు పట్టుతండ్రు ఈ గుట్టాలాగ కురిక్యాల కొండన్న పల్లి దగ్గరలోని కొండన్న పల్లి గుట్ట మాత్రం అక్కడ జరిగిన ప్రజా వ్యతిరేకత వల్ల ఆగిపోయింది. అక్కడ లింగయ్య సారు అలుపెరుగని పోరాటం వల్ల ఆగి పోయింది. బొమ్మలమ్మ గుట్టమీద జనవల్లబుడు చెక్కించిన కందపద్యం ఉన్నది ఇది తొలివెలుగు కంద పద్యశాసనం ఈశాసనం వల్ల రక్షించబడింది.. అలువె అన్ని గుట్టలకు ఇలాంటి చారిత్మ్రాక ఆధారాలు ఉండవు కదా ఆగుట్టాలన్ని రక్షించేవి ఎలా?

గుట్టలన్ని రక్షించేందుకు విధాన పరమైన న్యాయపరమైన నిర్ణయం తీసుకుంటా బాగుండునించినం రాజ్యం లో ఇమిడి పోయిన పాలకులు సైతం ఈ వ్యాపారం లో ఉన్నారు. ఇంకెందుకు ఊరుకుంటారు అసలు గుట్టముందు మనమంతా ఆగుట్ట ఎక్కడ ఆనందమంత ఇన్ని గుట్టల విధ్వంసాన్ని ఎవలు ఆపాలె ఇపుడు జిల్లాలోని గుట్టలన్ని గొసవెల్లబొస్తున్నది

గుట్ట పచ్చ నోట్ల కట్టింది

గుట్టను పుచ్చపండోలె కోస్కతింటుండ్రు

గుట్టను గులాబీ జామ్‌న్‌లా తింటుడ్రు

మనం దిక్కులు చూడవలసిందేనా! మనం మౌనంగా ఉండవల సిందేనా! మన సంఘాలు మన ప్రజాప్రతినిధులు మన చట్ట సభలు మన స్థానిక సంస్థలు మన నేతలు మౌనంగా ఉండాల్సిందేనా! గుట్టలను రక్షించే బాద్యత లేదా ! గుట్ట లే కాదు సహజన వనరులు వాగుల్లోని ఉసికె నదుల్లోని నీరు అడవి లోని చెట్టు భూమి అంతా హరించుడేనా భూమిలోని నీళ్లు ఖనిజాలు అన్ని అమ్మకానికేనా ప్రపంచంలో ఏదేశం లో లేని సహజవనరులు అమ్మకాలు మన దేశంలోనే అత్యధికంగా జరుగుతున్నాయి.

పట్టించుకోవల్సిన అవసరం ఉంది

గుట్టలను గుర్తుంచుకోవల్సిన అవసరం ఉంది.

అన్నవరం దేవేందర్‌

తాజావార్తలు