గుడిబండలో దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసుకున్న ఎస్ఆర్ఎం స్పోర్ట్స్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని పెంచారని  కోదాడ  శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్  అన్నారు. ఆదివారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ లో దళిత బంధు పథకం కింద లబ్ధిదారుడు ఏర్పాటు చేసుకున్న ఎస్ఆర్ఎం స్పోర్ట్స్ ఫిట్నెస్ సెంటర్ ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు ,ఉద్యోగాల కల్పనే భారత ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పక్షపాతి అని దళితులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరూపించుకుంటున్నారన్నారు. దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి అని  ఎటువంటి బ్యాంకు షరతులు లేకుండా తిరిగి చెల్లించేది లేకుండా నేరుగా లబ్ధిదారనికి పది లక్షల రూపాయలు అందజేయడం దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని అత్యంత ధైర్యవంతమైన పథకం దళిత బంధు అన్నారు. ఈ ఆలోచన కెసిఆర్ కు మాత్రమే సాధ్యమన్నారు. లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజలని నమ్ముకుని పనిచేస్తున్న భరాసా ప్రభుత్వానికి ప్రజలే భరోసా ఇవ్వాలన్నారు వ్యాయామశాలను స్థానిక యువకులు ఆదరించి ఆరోగ్యంతో పాటు లబ్ధిదారునికి ఆర్థిక చేయూతనివ్వాలన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే  ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ ఎంపిపి చింత కవిత రాధారెడ్డి, సర్పంచ్ అలివేలు మంగమ్మ, టిఆర్ఎస్ నాయకులు వెంపటి మధుసూదన్, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, పట్టణ కౌన్సిలర్లు  కందుల చంద్రశేఖర్, ఒంటిపులి రమా శ్రీనివాస్,గ్రామ శాఖ అధ్యక్షుడు సలీం, టిఆర్ఎస్ నాయకులు బిక్షం, శేషు, అంబేద్కర్, మాజీ సర్పంచ్ శీను, మహిళా అధ్యక్షురాలు గీత,  దళిత బంధు లబ్ధిదారులు, టిఆర్ఎస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు