*గుడుంబా, బెల్ట్ షాపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు.

*పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు,
పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు.
చిట్యాల18(జనంసాక్షి)గుడుంబా బెల్ట్ షాపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ విషయమై పలుమార్లు ఎక్సైజ్ పోలీస్ అధికారులకు తెలిపినప్పటికీ పట్టించుకోవడంలేదని మండల కేంద్రం ఎంపిటిసి కట్కూరి పద్మ నరేందర్  ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా రాత్రింబవళ్ళు అనకుండా విచ్చలవిడిగా అమ్మడం వల్ల చుట్టూ పక్కలఇండ్ల మహిళలకు రోడ్డుపై వెళ్లే మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మండల కేంద్రంలో చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధంగా మండల వ్యాప్తంగా వందల సంఖ్యలో బెల్టుషాపులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గతంలో కూడా మహిళా సంఘాలు, మహిళలు  గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్టు షాపులపై పలుమార్లు  ఎక్సైజ్ అధికారులకు తెలిపినప్పటికీ పెడచెవిన పెడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.