గుప్త నిధుల కోసం తవ్విన గుంతకు పోలీసుల నిషేధాజ్ఞలు!
భూపాలపల్లి ప్రతినిధి అక్టోబర్ 13 జనం సాక్షి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో గల గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇట్టి విషయంపై స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. గుప్త నిధుల విషయం తెలుసుకోవడం కోసం స్థానిక పోలీసులను వివరణ అడగగా గణపురం ఎస్సై ఎం అభినవ్ అందుబాటులో లేరని తెలిపారు. గణపేశ్వర ఆలయం కోటగుళ్లలో జరిగిన గుప్త నిధుల తవ్వకాలలో నిధులు దొరికాయా లేదా అనే విషయంపై మండలంలో జిల్లాలో గుప్త నిధుల విషయం సంచలనం రేపేస్తుంది. గుప్త నిధుల కోసం తవ్విన గుంత వద్దకు పోలీసులు వెళ్లి పరిశీలించగా పసుపు కుంకుమ నిమ్మకాయలు కొబ్బరికాయలు దారపు ఉండలు గుంతలో వెళ్లిన మట్టి ఉనుక బూడిద బండరాలను కుండ ముక్కలు వెలువడగా స్థానిక పోలీసులు వాటిని పరిశీలించి స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లినట్లు తెలిసింది. అట్టి గుంతస్థలాన్ని పోలీసులు నిషేధాజ్ఞలతో కూడిన కంచ వేయడం జరిగింది. పోలీసులు గత నాలుగు రోజుల నుండి కోటగుళ్ల ఆవరణలోకి ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు అనే విషయం అనే విషయంపై ఆలయ పూజారి ముస్కూరి నరేష్ ను సెక్యూరిటీ గార్డ్ తో పాటు గణపేశ్వరాలయం పరిరక్షణ కమిటీ సభ్యులను గోప్యంగా విచారిస్న్నట్లు తెలుస్తుంది. పురాతన ఆలయాల్లో ఇలాంటి తవ్వకాలు గతంలో కూడా జరిగాయని అందులో గుప్త నిధులు లభించిగా కొంత నిధిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పురాతనాలయాల లో గుప్తనిధుల కోసం తవ్వకాలు ఆలయ ప్రాంగణంలోని జమ్మి చెట్టు సమీపంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వారు ఇక్కడి వారైనా లేక ఇతర ప్రాంతాల నుండి వచ్చారా అనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. స్థానిక పోలీసులు గణపేశ్వరాలయం కోటగుళ్ల పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా మట్టి త్రవ్వకాల్లో బయటపడ్డ నిధులను స్వాధీనం చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే కావడంతో ఆలయంలో పనిచేసే వారికి తెలియకుండా గేటు తాళం వేసి ఉండగా అందులోకి వెళ్లి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం దావలంగా సంచలనం రేకేపిస్తుంది అని పలువురు పలు రకాలుగా చెప్పుకుంటున్నట్లు తెలుస్తుంది.
ReplyForward
|